Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
Satish Jarkiholi | ఓటర్ల జాబితా (Voters List) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో కర్ణాటక (Karnataka) లో ఓటర్స్ లిస్టు నుంచి దాదాపు కోటి ఓట్లను తొలగించడాన్ని ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీశ్ జర్కిహోళి (Satish Jarkiholi) సమర్థించారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు.
Satish Jarkiholi : ఓటర్ల జాబితా (Voters List) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో కర్ణాటక (Karnataka) లో ఓటర్స్ లిస్టు నుంచి దాదాపు కోటి ఓట్లను తొలగించడాన్ని ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీశ్ జర్కిహోళి (Satish Jarkiholi) సమర్థించారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, రెండుచోట్ల ఓటు ఉన్న డూప్లికేట్ ఓటర్ల పేర్లను మాత్రమే తొలగించారని, ఇది సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియలో ఎలాంటి గందరగోళం, అక్రమాలు జరగలేదని సతీశ్ జర్కిహోళి చెప్పారు. ఈ చర్యలవల్ల అర్హులైన ఏ ఒక్క ఓటరు హక్కుకు భంగం కలుగలేదని, బోగస్ ఓట్లను ఏరివేయడానికే ఈ ప్రక్రియ దోహదపడిందని తెలిపారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కర్ణాటకకు సంబంధించినది కాదని జర్కిహోళి స్పష్టంచేశారు. బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను అమలుచేసిన తీరుపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.
కర్ణాటకలో మాత్రం సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం, ముందస్తు సమాచారం అందించడంవల్ల సవరణ ప్రక్రియ సక్రమంగా పూర్తయిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతే పద్ధతిగా పారదర్శకంగా చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలనే విధానం మంచిదే అయినా దాన్ని అమలుచేసే తీరు సరిగ్గా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
‘నగర పారిశుధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం’
Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

