Medical Student | ప్రొఫెసర్‌తో సంబంధం అంటగడుతూ తోటి స్టూడెంట్స్ వేధింపులు.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
Medical Student : కర్ణాటకలోని మల్లాడిహల్లిలో దారుణం జరిగింది. తనకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌తో సంబంధం ఉందని తోటి విద్యార్థులు అవమానించడంతో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Medical Student : కర్ణాటకలోని మల్లాడిహల్లిలో దారుణం జరిగింది. తనకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌తో సంబంధం ఉందని తోటి విద్యార్థులు అవమానించడంతో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక, మల్లాడిహల్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో నిఖిత (22) అనే విద్యార్థిని బీఏఎంఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో పనిచేస్తున్న డా.రాజు అనే ప్రొఫెసర్‌తో నిఖితకు మంచి సన్నిహిత సంబంధం ఉండేది.
అయితే, దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆమె క్లాస్మేట్స్ ఇద్దరి మధ్యా ఎఫైర్ ఉందని భావించారు. దీనిపై కళాశాలలో చాలా ప్రచారం జరిగింది. అలాగే, తోటి విద్యార్థులు కూడా ఈ అంశంపై వేధించే వారు. ఇద్దరి మధ్యా సంబంధంపై రకరకాలుగా మాట్లాడేవారు. చివరకు వారి వేధింపులు భరించలేక నిఖిత తన స్వగ్రామంలోని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఒక సూసైడ్ లేఖ కూడా రాసింది. ఈ ఘటనపై యువతి తండ్రి ఉమా శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారు నిఖితను మానసికంగా వేధిస్తూ, అవమానాలకు గురి చేశారని కంప్లైంట్ చేశారు. తరచూ వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనను ఇతరులు వేధిస్తున్న అంశంపై ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పింది. వారు ఏదో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేవారు. అలాగే, చదువుపై దృష్టి పెట్టాలని కోరేవారు. చివరకు ఒత్తిడి భరించలేక నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

