Pani Puri | పానీపూరీలో క్యాన్సర్ కారకాలు.. సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో కృత్రిమ రంగులు!
పానీపూరీ తింటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. పానీపూరీ తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందట.
- కర్ణాటకలో పలు చోట్ల గుర్తింపు
Pani Puri | బెంగళూరు: పానీపూరీ తింటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. పానీపూరీ తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందట. పలు రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో కర్ణాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో సహా 79 చోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకర విషయాలు గుర్తించారు.
చాలా పానీపూరీ నమూనాల్లో వాటి సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. చాలా వరకూ శాంపిళ్లలో సన్‌సెట్ యెల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్టు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు. బెంగళూరులో సేకరించిన 49కి 19 శాంపిళ్లలో సింథటిక్ రంగులు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పానీ పూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్‌లు, స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్‌ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

