15 ఏండ్ల లోపు వారికి కోచింగ్ బంద్
కోచింగ్/ట్యుటోరియల్ సెంటర్లపై కర్ణాటక ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. 15 ఏండ్ల లోపు విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో ప్రవేశాన్ని నిషేధించడమే కాక, విద్యార్థులు చెల్లించాల్సిన మొత్తం ఫీజును కనీసం నాలుగు విడతలలో చెల్లించే వెసులుబాటును కల్పించింది.
- సెకండరీ స్కూల్ పూర్తయిన వారికే అడ్మిషన్‌కు అనుమతి
- రోజుకు ఐదు గంటలే తరగతులు
- నాలుగు విడతల్లో ఫీజు చెల్లింపు
- కోచింగ్ సెంటర్లపై కర్ణాటక ఆంక్షలు
బెంగళూరు : కోచింగ్/ట్యుటోరియల్ సెంటర్లపై కర్ణాటక ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. 15 ఏండ్ల లోపు విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో ప్రవేశాన్ని నిషేధించడమే కాక, విద్యార్థులు చెల్లించాల్సిన మొత్తం ఫీజును కనీసం నాలుగు విడతలలో చెల్లించే వెసులుబాటును కల్పించింది. విద్యార్థి వైదొలగిన 10 రోజులలో నిర్వహించని తరగతులకు సంబంధించిన ఫీజును వాపసు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. కర్ణాటక ట్యుటోరియల్ సంస్థలు, కోచింగ్ సెంటర్ల (నమోదు, నియంత్రణ) నిబంధనలు 2026ను బుధవారం గెజిట్‌లో ప్రచురించింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రతిరోజూ గరిష్ఠంగా 5 గంటలు మాత్రమే కోచింగ్ ఇవ్వాలి. దీనిని అతిక్రమిస్తే ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు.
నమోదు తప్పనిసరి
కోచింగ్ సెంటర్ కార్యకలాపాలను ప్రారంభించే ముందు వాటిని తప్పనిసరిగా నమోదు చేయించాలి. ప్రస్తుతం నడుస్తున్న సంస్థలు 90 రోజుల్లోగా దీనికోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే కోచింగ్ ఇవ్వాలి. అయితే పాఠశాలలు, కాలేజీలు పనిచేసే వేళల్లో తరగతులు నిర్వహించకూడదు. సెకండరీ స్కూల్ పరీక్ష పూర్తయిన విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ కల్పించాలి. ర్యాంకులు, అత్యధిక మార్కుల పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టడాన్ని కొత్త నిబంధనలు నిరోధించాయి.
అలాగే పరీక్ష ఫీజు మొత్తాన్ని ఒకేసారి వసూలు చేసే విధానానికి అడ్డుకట్ట వేసింది. కనీసం నాలుగు విడతలుగా ఫీజును చెల్లించే వెసులుబాటును విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది. ఈ నిబంధనలన్నీ ఆయా కోచింగ్ సెంటర్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తప్పక తెలియజేయాలి. రిఫండ్ పాలసీలు, స్టూడెంట్ల సంఖ్య గురించి వెబ్సైట్లలో, నోటీస్ బోర్డులలో, ప్రాస్పెక్ట్లలో అప్డేట్ చేయాలి. పుస్తకాలు, స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయమని విద్యార్థులపై ఒత్తిడి తేరాదని నిబంధనల్లో స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

