Karnataka: సీఎం సిద్ధరామయ్య ఇంట్లో డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్
Karnataka : కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇంట్లో ఇవాళ డిప్యూసీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. కర్నాటకలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంటుందని గత కొన్నాళ్ల నుంచి ఊహానాగాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది.
బెంగుళూరు: కర్నాటక(Karnataka) సీఎం సిద్ధరామయ్య ఇంట్లో ఇవాళ డిప్యూసీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి కర్నాటకలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంటుందని ఊహానాగాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు శివకుమార్ సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతల భేటీ కీలకంగా మారింది.
డీకే శివకుమార్‌తో ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ చేశానని సీఎం సిద్ధరామయ్య తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. కావేరి రెసిడెన్స్‌లో సీఎం సిద్ధరామయ్యతో ఉదయం అల్పహారం తీసుకున్నట్లు శివకుమార్ కూడా ట్వీట్ చేశారు. కర్నాటక ప్రభుత్వ ప్రాధాన్యతలు, ముందున్న సవాళ్ల గురించి చర్చించనున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఉప్మా, ఇడ్లీ, కేసరీ బాత్ తింటున్న ఆ ఇద్దరు ఫోటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అయితే శివకుమార్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు కొన్ని విశ్వాస వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే బ్రేక్‌ఫాస్ట్ భేటీలో శివ-సిద్దు ఫార్ములా బయటకు వస్తుందని కొందరు భావిస్తున్నారు.
అధికార మార్పిడి జరిగే వరకు మాత్రం ఇద్దరు నేతలు తమ పదవుల్లో కొనసాగనున్నారు.
ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಇಂದು ಅವರ ಕಾವೇರಿ ನಿವಾಸದಲ್ಲಿ ಭೇಟಿಯಾಗಿ ಉಪಾಹಾರ ಸಭೆ ನಡೆಸಲಾಯಿತು.
Met Hon’ble CM Shri @siddaramaiah avaru at Cauvery Residence this morning for a breakfast meeting. A productive discussion on Karnataka’s priorities and the road ahead. pic.twitter.com/qhe7q5RNvi
— DK Shivakumar (@DKShivakumar) November 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

