Kannada Language | సైన్బోర్డుల్లో 60శాతం కన్నడ భాషే..! భాషా సమగ్రాభివృద్ధి బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం..!
Kannada Language | కర్ణాటక అసెంబ్లీ గురువారం కన్నడ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) బిల్లు-2024ను ఆమోదించింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల సైన్బోర్డులను 60శాతం కన్నడ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది.
Kannada Language | కర్ణాటక అసెంబ్లీ గురువారం కన్నడ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) బిల్లు-2024ను ఆమోదించింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల సైన్బోర్డులను 60శాతం కన్నడ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం రెండేళ్ల నాటి చట్టాన్ని సవరించింది. వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సంస్థలు, ట్రస్టులు, కౌన్సెలింగ్ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రయోగ శాలలు, హోటల్స్ ఇలాంటి అన్నింటికి చెందిన సైన్బోర్డుల్లో తప్పనిసరిగా 60శాతం కన్నడ భాషలోనే రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందన్నారు.
కొత్త లైసెన్సులు, ప్రస్తుతం ఉన్న వాటిని పునరుద్ధరించే సమయంలో సైన్బోర్డుల్లో కన్నడ భాష వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటించారా? లేదా ? చూస్తామని.. లేకపోతే జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నేమ్ బోర్డుల్లో కన్నడ వాడని సమస్య బెంగళూరులో మాత్రమే ఉందని.. బెంగళూరులోని ఎనిమిది మునిసిపల్ ఏరియాల్లో ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ కమిటీలు కన్నడను ఉపయోగించకపోవడంపై ఫిర్యాదులను స్వీకరిస్తాయని.. ఇందుకోసం ‘కంగవాస్’ పేరుతో యాప్ను తీసుకుస్తామన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది కర్నాటకలో భాషా వివాదం చెలరేగింది. దుకాణాదారులు, ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డుల్లో 60శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలనే ఉద్యమం కొనసాగింది. దుకాణాల ముందు ఇంగ్లిష్ సైన్ బోర్డుల ఏర్పాటు చేయడంతో కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందంటూ కర్ణాటక రక్షణ వేదిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

