మాస్క్ నుంచి మొక్కలు..కర్నాటక కుర్రాడి వెరైటీ ప్రయోగం
గత రెండేళ్లుగా కోవిడ్ తో ప్రపంచం అల్లాడుతోంది. టీకాలతో పాటు మాస్క్ లను కూడా తప్పకుండా పెట్టుకోవాలని ఇప్పటికే ఆయాదేశాలు ప్రజలను ఆదేశించాయి. అయితే ఈ మాస్క్ లను వాడేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా సర్జికల్ మాస్క్ ల వల్ల ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయం కనుగొన్నాడు ఈ కుర్రాడు.
కర్నాటకు చెందిన నితిన్ వ్యాస్ ఎకో ఫ్రెండ్లీ మాస్క్ లను తయారుచేశాడు. ఈ మాస్క్ లను మీరు వాడి పారేసిన కొద్దిరోజులకు అవి మొక్కలవుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమంటున్నాడు ఈకుర్రాడు. అదెలా అంటే కాటన్ క్లాత్ తో తయారుచేయబడిన ఈ మాస్క్ లో ఓ లేయర్ లో విత్తనాలు పెట్టాడు. పండ్లు, కూరగాయల విత్తనాలను ఇందులో ఉంచాడు.
మీరు దీన్నివాడేసిన తర్వాత ఇంట్లో భూమిలో పాతితే కొద్దిరోజుల్లోనే మొక్కలు వస్తాయంటున్నాడు నితిన్ వ్యాస్. కాటన్ తో తయారుచేసింది కాబట్టి తడపవద్దంటున్నాడు. సర్జికల్ మాస్క్ లాగా మెత్తగా ఉండదు కానీ ఈ ఎకో ఫ్రెండ్లీ మాస్క్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదన్న విషయాన్ని గుర్తించుకొని వీటిని వాడమని సలహా ఇస్తున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి



