కొవిడ్‌పై పోరుకు కర్ణాటక సీఎం, మంత్రుల భారీ విరాళం
BS Yedurappa: కరోనా వైరస్‌పై పోరు కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు ఏడాది వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి

బెంగళూరు: కరోనా వైరస్‌పై పోరు కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు ఏడాది వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ వారం మొదట్లోనే ఈ విషయంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా ఈ నెల 11న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. రాష్ట్రం కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కుకోవడంతో బయటపడేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తున్నది.
రాష్ట్రంలో ప్రతిరోజూ 40-50 వేలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆరు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 6 వేల మరణాలు సంభవించాయి. కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. అలాగే అవసరమైన మందుల కొరత కూడా వేధిస్తున్నది. కరోనాను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 24 వరకు లాక్డౌన్ అమలు చేస్తోంది.
కాగా, కరోనాపై పోరు కోసం ముఖ్యమంత్రి యడియూరప్ప తన వేతనాన్ని విరాళంగా ప్రకటించడం ఇది రెండోసారి. గత నెలలో తన ఏడాది వేతనం రూ. 24.10 లక్షలను వేతనంగా ఇచ్చేశారు. రూ.24.10 లక్షల చెక్‌ను అప్పటి చీఫ్ సెక్రటరీ టీఎం విజయ్ భాస్కర్‌కు అందించారు. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

