కాన్పూర్ హాస్టల్ విద్యార్థినుల నిరసన… స్నానం చేస్తుండగా వీడియోలు తీసినట్లు ఆరోపణ
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు చెప్పారు.
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తాము స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసినట్లు హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. యూపీలోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సాయి నివాస్ బాలికల హాస్టల్లో పని చేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్లో అసభ్య వీడియోలను గుర్తించారు. బాలికలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో రికార్డు చేసినట్లు అనుమానించారు. దీంతో ఆ హాస్టల్ విద్యార్థినులు దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు చెప్పారు.
కాగా, ఇటీవల ఇలాంటి సంఘటన పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీని కుదిపేసింది. హాస్టల్‌కు చెందిన యువతి రహస్యంగా రికార్డు చేసిన తమ ఫొటోలు, వీడియోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపిందని ఆరోపిస్తూ విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

