బెంగళూర్ : కన్నడ నటి చేతనా రాజ్ (21) బెంగళూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ప్లాస్టిక్ సర్జరీ కోసం ఆమె సోమవారం ఆస్పత్రిలో చేరగా సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయారు. ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ పేరుకుపోవడంతో ఆమె మరణించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
వైద్యుల నిర్లక్ష్యంతోనే చేతనా రాజ్ తమకు కాకుండా పోయిందని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతనా రాజ్ పలు టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొవ్వును తొలగించే సర్జరీ కోసం చేతనా రాజ్ సోమవారం బెంగళూర్‌లోని షెట్టి కాస్మెటిక్ సెంటర్లో చేరారు.
మరోవైపు చేతనా రాజ్ మరణించిందని తెలిసినా ఆమె గుండెపోటుకు గురైందని షెట్టి కాస్మెటిక్ సెంటర్ నిర్వాహకులు కాదే ఆస్పత్రికి తీసుకువచ్చారని ఆస్పత్రి ఐసీయూ ఇంటెన్సివిస్ట్ సందీప్ బసవేశ్వరనగర్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం తలెత్తిన కాంప్లికేషన్స్తో ఆమె తుదిశ్వాస విడిచింది. సర్జరీ గురించి చేతనా తల్లితండ్రులకు సమాచారం ఇవ్వలేదని ఫ్రెండ్స్‌తో కాస్మెటిక్ సెంటర్‌కు వచ్చిందని తెలిసింది.