28న కాంగ్రెస్‌లో చేరనున్న కన్నయ్య కుమార్, జిగ్నేష్ మెవాని

న్యూఢిల్లీ : సీపీఐ నేత కన్నయ్య కుమార్, రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ (ఆర్‌డీఏఎం) ఎమ్మెల్యే జిగ్నేష్ మెవాని ఈనెల 28న కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే యువనేతల చేరికకు మరింత ముందుగా సెప్టెంబర్ 28నే ముహుర్తం ఖరారు చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మెవానీకి కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. ఇక జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ఇప్పటికే కాంగ్రెస్‌లో తన పాత్రపై రాహుల్, ప్రియాంకలతో పలుమార్లు చర్చించారు. కన్నయ్య కుమార్‌కు సైతం బిహార్‌లో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. మరోవైపు పంజాబ్‌లో దళిత సీఎం నియామకం పట్ల జిగ్నేష్ మెవానీ కాంగ్రెస్ పార్టీపై మరింత సానుకూలత కనబరుస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

