పరీక్షల నిర్వహణే సబబు: కమల్‌హాసన్
Kamal Hasan on 12th Exams: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడమే మంచిదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.

చెన్నై: కొంత ఆలస్యమైనా సరే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడమే మంచిదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కమల్‌హాసన్ కోరారు.
కొవిడ్-19 కారణంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలామంది విద్యా నిపుణులు విమర్శలు చేస్తున్నారని కమల్‌హాసన్ గుర్తుచేశారు. సరైన ప్రణాళికతో పరీక్షలు నిర్వహించడం అనేది మంచి పద్ధతని, ప్రొఫెషనల్ కోర్సులు, విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు చాలా కీలకమని కమల్ అన్నారు.
అవసరమైతే సిలబస్‌ను కొంత మేర కుదించి పరీక్షలకు ముందే విద్యార్ధులకు సమాచారం ఇవ్వాలని కమల్‌హాసన్ సూచించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన విషయాన్ని పాలకులు గమనించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం కేరళను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పరీక్షలను నిర్వహించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

