JDU | నరేంద్రమోదీ క్యాబినెట్లో జేడీయూకు రెండు మంత్రి పదవులు.. ఆ ఇద్దరు ఎవరంటే..!
JDU | కొత్తగా కొలువుదీరబోతున్న నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోని కీలక భాగస్వామ్యపక్షమైన జనతాదల్-యునైటెడ్ (JD-U) కు రెండు క్యాబినెట్ బెర్త్‌లు దక్కనున్నాయి. పార్టీలోని ఇద్దరు సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. జేడీయూలోని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
JDU : కొత్తగా కొలువుదీరబోతున్న నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోని కీలక భాగస్వామ్యపక్షమైన జనతాదల్-యునైటెడ్ (JD-U) కు రెండు క్యాబినెట్ బెర్త్‌లు దక్కనున్నాయి. పార్టీలోని ఇద్దరు సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. జేడీయూలోని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
తమ పార్టీలో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై జేడీయూ ఇప్పటికే ఒక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. సీనియర్ నేతలైన లలన్‌సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లను కేంద్ర పదవుల కోసం జేడీయూ ప్రతిపాదించినట్లు సమాచారం. లలన్‌సింగ్ బీహార్‌లోని ముంగేర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
రామ్‌నాథ్ ఠాకూర్ ఇటీవల మరణానంతం భారతరత్న అవార్డు పొందిన కర్పూరీ ఠాకూర్ కుమారుడు. కాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ 12 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి సొంత మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా ఏ మిత్రపక్షానికి ఎన్ని క్యాబినెట్ బెర్త్‌లు అనే కోణంలో చర్చ జరుపుతోంది.
కేంద్ర మంత్రలుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారనేది ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమంలోపు నిర్ణయిద్దామని, శుక్రవారం జరిగిన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు రేపు సాయంత్రంలోగా మంత్రలుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారనేది నిర్ణయించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

