JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
JNU professor : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రకటించింది.
JNU professor : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రకటించింది. తమ యూనివర్సిటీ నిర్వహించిన అంతర్గత కమిటీ విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్‌యూ శుక్రవారం వెల్లడించింది. సోషల్ సైన్సెస్ విభాగంలో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ బోధిస్తున్న ప్రొఫెసర్‌ను వెంటనే డిస్మిస్ చేసినట్లు తెలిపింది.
ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కొద్ది రోజుల క్రితం కొందరు విద్యార్థినులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సబ్జెక్టు బోధన పేరుతో తన ఇంట్లో కలవాల్సిందిగా విద్యార్థినులను కోరేవాడు. దీంతో అతడి ఇంటికి వెళ్లిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలాగే, పాఠాలు బోధిస్తున్న సమయంలో కూడా అభ్యంతరకరమైన విషయాలు చెప్పేవాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థినులు యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై యూనివర్సిటీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఫిర్యాదును నమోదు చేసుకుని విచారణ జరిపింది. ఈ విచారణ అనంతరం ఆ ప్రొఫెసర్ తప్పు చేసినట్లు గుర్తించింది.
వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అతడిపై మరిన్ని కఠినమైన చర్యలకు కమిటీ సిఫారసు చేసింది. ఇక, ఇదే అంశంపై ఢిల్లీలోని మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాల్సిందిగా జేఎన్‌యూను ఆదేశించింది. సుమోటోగా స్పందించిన కమిషన్.. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వీసీని ఆదేశించింది. వివిధ సెక్షన్లు, పోష్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

