న్యూఢిల్లీ: రంగుల కేళీ.. హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రకరకాల రంగులు చల్లుకుంటూ ఆ పండుగను జనం ఎంజాయ్ చేస్తున్నారు. భారత్లో ఉన్న జపాన్ అంబాసిడర్(Japan Ambassador) హిరోషి సుజుకి కూడా హోలీ ఆడారు. ఆయన తన భార్య ఇకియో సుజుకితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను .. అంబాసిడర్ హిరోషికి ఎంతో నచ్చుతాయి. హోలీ పండుగ సందర్భంగా గులాల్ను ఆయన తన భార్యపై చల్లారు. ఆమె కూడా తన చేతుల్లో ఉన్న గులాల్ రంగును భర్తపై చల్లింది. హ్యాపీ హోలీ అంటూ ఆయన తన వీడియోకు పోస్టు చేశారు. ఆ ఇద్దరూ హోలీ ఎంజాయ్ చేస్తున్న వీడియోపై ఫాలోవర్స్ కామెంట్ చేశారు. ఆ దంపతులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Happy Holi!! pic.twitter.com/fgQQxgl9EZ
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) March 24, 2024