JDS | జేడీఎస్‌లో బీజేపీ కుంపటి.. చీలిక దిశగా దేవెగౌడ నేతృత్వంలోని పార్టీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- చీలిక దిశగా జనతా దళ్ (సెక్యులర్)
- బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న పార్టీ కర్ణాటక అధ్యక్షుడు ఇబ్రహీం
- తమదే అసలైన జేడీఎస్ అని వ్యాఖ్య
- రాష్ట్రంలో పార్టీ విధానాలపై నిర్ణయాధికారం నాదే
- బీజేపీతో మీరు వెళ్లండి.. మేం రాం
- పొత్తుపై పునరాలోచన చేయాలని పార్టీ సుప్రీం దేవెగౌడకు సూచన
JDS | బెంగళూరు, అక్టోబర్ 16: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు. కొంత మంది పార్టీ నేతలతో ఆయన సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కలిసి వెళ్లొద్దని పార్టీ సుప్రీం దేవెగౌడను కోరారు. సెక్యులర్‌గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. తనకే అధికారం ఉంటుందని అన్నారు. ‘వారు(దేవెగౌడ, కుమారస్వామి) బీజేపీతో వెళ్లాలనుకొంటే వెళ్లొచ్చు. తాము మాత్రం ఆ పని చేయలేం’ అని వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. బీజేపీతో వెళ్లకూడదని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నామన్నారు. తనతో చాలా మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని పేర్కొన్న ఇబ్రహీం.. వారి పేర్లు చెప్పేందుకు మాత్రం తిరస్కరించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో సమావేశం అవుతానని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు.
పార్టీని వీడుతున్న నేతలు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో కలిసి వెళ్లకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని, అదేవిధంగా కూటమిని ఆమోదించవద్దని దేవెగౌడను కోరుతామని ఇబ్రహీం పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రకటన వల్ల కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో నేతలు పార్టీని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఆ కమిటీ దేవెగౌడకు వివరిస్తుందని తెలిపారు.
నిర్ణయం కోసం వేచి ఉంటాం: కుమారస్వామి
ఇబ్రహీం ప్రకటనపై కుమారస్వామి స్పందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్వతంత్రుడు అని, అతని నిర్ణయం కోసం తాము వేచి ఉంటామని అన్నారు. ‘పార్టీ నేతలు, కార్యకర్తలు తీసుకొన్న నిర్ణయం ఒకటుంటుంది. ఆ నేపథ్యంలో అతను(ఇబ్రహీం) ఏర్పాటు చేసిన సమావేశంలో దానిపై తన మద్దతుదారులతో చర్చించారు. అతను తన నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

