మాండ్యా: కర్నాటకలోని జనతాదళ్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ ఓ కాలేజీ ప్రిన్సిపాల్‌పై చేయి చేసుకున్నారు. మాండ్యా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే నల్వాది కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీ సమీక్షకు వెళ్లారు. అయితే ఆ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ డెవలప్మెంట్ వర్క్ గురించి అడిగిన సమయంలో ప్రిన్సిపాల్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే.. ప్రిన్సిపల్‌పై చేయి చేసుకున్నారు. పదేపదే ఆయన్ను కొడుతూ కనిపించారు. ఈ ఘటన జూన్ 20వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రిన్సిపాల్‌ను ఎమ్మెల్యే కొడుతున్న సమయంలో అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు.
JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone
This happens when power goes to head
Shame😈 pic.twitter.com/8RTCCud8Mo
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022