Jaishankar: ఉగ్రవాదాన్ని నిర్మూలించకుంటే.. సహకారం కుదరదు: పాకిస్థాన్‌లో మంత్రి జైశంకర్
Jaishankar : ఉగ్రవాదాన్ని నిర్మూలించకుండా రెండు దేశాల మధ్య సహకారం కుదరదు అని మంత్రి జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఎనర్జీ, కనెక్టివిటీ లాంటి రంగాల్లో సహకారం కొనసాగాలంటే, సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ఆగిపోవాలన్నారు. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఎస్సీవో సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో విదేశాంగ మంత్రి జై శంకర్(Jaishankar ) పాల్గొన్నారు. మంగళవారం రాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇచ్చిన విందుకు ఆయన హాజరయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించకుండా రెండు దేశాల మధ్య సహకారం కుదరదు అని మంత్రి జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఎనర్జీ, కనెక్టివిటీ లాంటి రంగాల్లో సహకారం కొనసాగాలంటే, సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ఆగిపోవాలన్నారు. ఎస్సీవో సదస్సులో ఆయన ప్రసంగిస్తూ సంయుక్త గౌరవం, సమానత్వం మధ్య సహకారం జరగాలన్నారు. ప్రాంతీయ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని దేశాలు గుర్తించాలన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ నేతృత్వంలో ఎస్సీవో మీటింగ్ జరుగుతోంది. ఎస్సీవో సభ్య దేశాల మధ్య నమ్మకం ఉంటే సహకారం లాభదాయకంగా ఉంటుందన్నారు. గ్రూపులో ఉన్న దేశాలు ఒక్కటిగా ముందుకు వెళ్లాలన్నారు. ఏకపక్షంగా కాకుండా, చాలా నిస్వార్థపూరిత భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సరిహద్దుల వద్ద ఉగ్రవాదం, తీవ్రవాదం లాంటి కార్యకలాపాలు పెరిగితే, అప్పుడు వాణిజ్యం, ప్రజా రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయని జైశంకర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

