India Stops Ravi Water Flow To Pak | 45 ఏళ్లకు పూర్తైన డ్యామ్ నిర్మాణం.. పాక్‌కు నదీ జలాలు బంద్
India Stops Ravi Water Flow To Pak | ఎట్టకేలకు 45 ఏళ్ల తర్వాత డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది. దీంతో పాకిస్థాన్‌కు నదీ జలాలు బంద్ అయ్యాయి.
చండీగఢ్: ఎట్టకేలకు 45 ఏళ్ల తర్వాత డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది. దీంతో పాకిస్థాన్‌కు నదీ జలాలు బంద్ అయ్యాయి. (India Stops Ravi Water Flow To Pak) ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో సంతకం చేసిన 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదీ జలాలపై భారత్‌కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని అడ్డుకునేందుకు రంజిత్ సాగర్ డ్యామ్, దిగువన షాపూర్ కంది బ్యారేజీ నిర్మించడానికి పంజాబ్, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాలు 1979లో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఈ డ్యామ్ పూర్తవుతుందని భావించారు.
కాగా, రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం 2001లో పూర్తయ్యింది. అయితే షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. 2008లో దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2013లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2014లో పంజాబ్, జమ్ముకశ్మీర్ మధ్య వివాదాల కారణంగా ప్రాజెక్ట్ మళ్లీ నిలిచిపోయింది.
మరోవైపు 2018లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ప్రారంభమైన డ్యామ్ నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో రావి నదీ జలాలు పాకిస్థాన్‌కు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు పాక్‌కు వెళ్తున్న ఈ నీటిని జమ్ముకశ్మీర్‌తోపాటు పంజాబ్, రాజస్థాన్‌లోని పలు జిల్లాలకు సాగునీటి కోసం వినియోగించనున్నారు. అలాగే డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే హైడల్ పవర్లో 20 శాతం విద్యుత్ జమ్ముకశ్మీర్ పొందుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
Vrushakarma | ‘వృషకర్మ’ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా : నాగచైతన్య
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
వార్డుల వారీగా జీవిత బీమా కౌంటర్లు : ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్ది
‘వైరాలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

