GST on Gangajal | మోదీ సర్కారు భక్తిపూర్వక సుంకం.. గంగా జలంపై 18 శాతం జీఎస్టీ
‘పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామాన్యుల ఉసురుతీస్తున్నది.
- 18 శాతం పన్ను విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్
- ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వెల్లువ
- ఐదేండ్లలో జీఎస్టీ చట్టానికి 907 సవరణలు
- పాల పదార్థాల నుంచి గంగా నీటి వరకు..
- జీఎస్టీతో బీజేపీ సర్కారు పన్నుల బాదుడు
GST on Gangajal | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామాన్యుల ఉసురుతీస్తున్నది. 2017లో అమల్లోకి తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) పేరిట సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నది. ఈ ప్రహసనంలో హిందువులు పరమ పావనిగా, సకల పాప హరణిగా కొలిచే ‘గంగా జలం’పై కూడా 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్టు ఇటీవల ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది.
ప్యాకేజ్డ్ గంగ వాటర్, ఆన్లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ప్యాకేజ్డ్ గంగా జలంపై ఈ పన్ను వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.30కే ఇప్పటివరకూ లభిస్తున్న 250 మిల్లీలీటర్ల ‘గంగాజల్’, ‘గోముఖ్’ వంటి బ్రాండ్ గంగా జలం వాటర్ బాటిల్స్ ఇకపై రూ.35కు పెరుగనున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంపై సామాన్యులు మండిపడుతున్నారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో పూజా కార్యక్రమాల్లో వినియోగించే గంగా జలంపై పన్నును విధించడమేంటని నిలదీస్తున్నారు. ప్రజలను దోచుకోవడానికే కేంద్రం జీఎస్టీ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యుడు తినాలా? వద్దా??
కోట్ల మంది పేదలు, మధ్యతరగతి జీవులకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి, పాల ఉత్పత్తులు, ప్రీప్యాక్డ్, ప్రీలేబుల్డ్ ఆహార ధాన్యాలు, చేపలు, పన్నీర్, తేనె, ఫ్రీజ్ చేయని మాంసం, చెక్కర, టీ పొడి ఇలా దాదాపు అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై 5% జీఎస్టీ విధించిన కేంద్రం.. పసిపిల్లలకు వాడే పాల పొడిపైనా జీఎస్టీని విధించింది. రోగమొచ్చి దవాఖానకు వెళ్లినా 5% పన్ను, విద్యార్థులు వాడే పెన్సిళ్లు, షార్ప్నర్లు, ప్యాకేజ్డ్ బట్టర్, నెయ్యి, పండ్లరసాలు, హోటల్‌కు వెళ్లి తిందామంటే 12%, ఆరోగ్య బీమా చెల్లింపులపై 18% పన్నువాత పెట్టింది. 2017 నుంచి కిందటేడాది నవంబర్ వరకు జీఎస్టీ చట్టంలో కేంద్రం ఏకంగా 907 సవరణలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

