BBC: బీబీసీ ఆఫీసుల్లో రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు
BBC :రెండో రోజు కూడా బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రంతా కూడా తనిఖీలు జరిగాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరో వైపు బీబీసీ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ చేసింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐటీశాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచన చేసింది. వ్యక్తిగత ఆదాయం అంశాలపై ఉద్యోగులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా బీబీసీ తన మెయిల్లో స్పష్టం చేసింది. ఐటీ అధికారులు సమగ్రమైన రీతిలో సమాధానం ఇవ్వాలని బీబీసీ తన ఉద్యోగులకు తెలిపింది.
రెండో రోజు సోదాల్లో కేవలం ట్యాక్స్ డిపార్టమెంట్ను మాత్రమే ఐటీ అధికారులు టార్గెట్ చేయనున్నారు. బీబీసీపై జరుగుతున్న ఐటీ తనిఖీల అంశంపై ఇప్పటి వరకు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. సర్వేలో భాగంగా సీనియర్ మేనేజ్మెంట్ను ప్రశ్నించనున్నట్లు ఐటీశాఖ పేర్కొన్నది. పన్ను ఎగవేతలు, ఆదాయ లాభాలను దారి మళ్లించడం లాంటి నేరాలకు బీబీసీ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ బీబీసీకి నోటిసులు ఇచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు.
అయితే ఐటీ అధికారులతో మంగళవారం కొందరు ఉద్యోగులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఎటువంటి వారెంట్ లేకుండా ఎలా తమ సంస్థలోకి ఎంట్రీ అయినట్లు వాళ్లు ప్రశ్నించారు. పన్ను పేరుతో తమ వద్ద ఉన్న సమాచారాన్ని డెస్క్‌టాప్‌ల నుంచి సేకరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

