బీజేపీ దోపిడీ పాలనకు తెర..అభివృద్ధే అజెండాగా ముందుకెళతాం : ఆప్ సీఎం అభ్యర్ధి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్‌కు చేరడంతో మాటల తూటాలు పేలుతున్నాయి.
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్‌కు చేరడంతో మాటల తూటాలు పేలుతున్నాయి. తమకు రాజకీయాలు చేతకాదని, ప్రజల కోసం పనిచేయడమే తమకు తెలుసని ఆప్ సీఎం అభ్యర్ధి ఇసుదన్ గధ్వి స్పష్టం చేశారు.
ఢిల్లీ సీఎం, ఆప్ చీప్ అరవింద్ కేజ్రీవాల్ పట్ల గుజరాతీల్లో ఆశలు మొలకెత్తాయని, తాను ఆయన ప్రతిష్టను ఇనుమడింపచేస్తానని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో రైతుల సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అభివృద్ధి రాజకీయాలు, ఉద్యోగుల అవుట్సోర్సింగ్ వంటి అంశాలు ప్రధానంగా ముందుకొచ్చాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల రేసులో కాంగ్రెస్ అసలు లేనేలేదని పేర్కొన్నారు.
ఆప్ సీఎం అభ్యర్ధి ఇసుదన్ గధ్వి ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ పలు విషయాలు ముచ్చటించారు. గుజరాత్లో 27 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాషాయ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. పేదలకు తమ పిల్లలు మెరుగైన విద్యను పొందే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం తాయిలాలు కాదని తేల్చిచెప్పారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

