విదేశీ శాటిలైట్ల ప్రయోగం కోసం 4 దేశాలతో ఇస్రో ఒప్పందం

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాలుగు దేశాలతో ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2021 నుంచి 2023 మధ్య కాలంలో విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనున్నది. రాజ్యసభలో మంత్రి దీనిపై లిఖిత సమాధానం ఇచ్చారు. విదేశీ ఉపగ్రహాలను నింగికి పంపడం వల్ల సుమారు 132 మిలియన్ల యూరోలు ఆర్జించవచ్చు అన్నారు. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) .. అంతరిక్ష శాఖ అనుబంధంతో.. విదేశీ శాటిలైట్లను ప్రయోగిస్తోంది. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ఆ ప్రయోగాలు సాగుతున్నట్లు మంత్రి సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇస్రో 124 స్వదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వాటిల్లో 12 విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

