SSLV-D1 రాకెట్ ప్రయోగం.. కక్ష్యలోకి రెండు ఉపగ్రహాలు
SSLV-D1 | ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ- డీ1ని విజయవంతంగా
శ్రీహరికోట: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ- డీ1ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ఉదయం 9.18 గంటలకు రాకెన్ ప్రయోగించింది. నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ఈ సరికొత్త వాహకనౌక కేవలం 13.2 నిమిషాల్లోనే ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో మారుమూల గ్రామాలను ఇంటర్నెట్తో అనుసధానం చేయడానికి అవకాశం కలుగనుంది.
ISRO launches its new SSLV-D1 rocket from Sriharikota
Read @ANI Story | https://t.co/uIPigY0TNL#ISRO #SSLVD1 #ISROIndia pic.twitter.com/7duROVWlp5
— ANI Digital (@ani_digital) August 7, 2022
34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న SSLV-D1 వాహక నౌక.. ఈఓఎస్-02, ఆజాదీ శాట్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి వాటిని ప్రవేశపెట్టింది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేశారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేశారు.

ఇక నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్- 2ఏ (ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెట్టింది. తనంతరం ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టింది.
కాగా, ‘ఆజాదీశాట్’ అభివృద్ధిలో తెలంగాణ విద్యార్థులు పాలుపంచుకున్నారు. దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది చొప్పున మొత్తం 750 బాలికలు ఈ శాటిలైట్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వారిలో మన రాష్ట్రంలోని 5 పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు ఉన్నారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల ఉన్నత పాఠశాల, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజీ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సిద్దిపేట జిల్లా గుర్జకుంటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులున్నారు. ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఈ విద్యార్థి బృందం.. ఇస్రో మార్గదర్శనంలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ) ‘ఆజాదీశాట్’ను రూపొందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- SSLV-D1
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

