Israel-Hamas War | ఆత్మీయుల యోగక్షేమాలపై ఆరా : భారత్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరుల ఆందోళన
ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర పోరు కొనసాగుతుండగా యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా ఇప్పటివరకూ పౌరులు సహా 3000 మందికిపైగా మరణించారు.
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర పోరు కొనసాగుతుండగా యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా ఇప్పటివరకూ పౌరులు సహా 3000 మందికిపైగా మరణించారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్ వాసులు భయాందోళన మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. స్వదేశంలో తమ ఆత్మీయుల భద్రతపై ఆరా తీస్తూ ఆందోళన చెందుతున్నారు. వీరిలో కొందరు ఇజ్రాయలీలు కొద్దికాలంగా భారత్‌లో నివసిస్తుండగా, మరికొందరు టూరిస్ట్‌లుగా ఇక్కడికి వచ్చారు.
ఇజ్రాయెల్‌లో మారణహోమంతో కలత చెందిన వీరు స్వదేశానికి చేరుకుని తమ వారి చెంతకు చేరాలని తహతహలాడుతున్నారు. హమాస్ మెరుపుదాడుల అనంతరం తమ కుటుంబసభ్యులతో మాట్లాడానని హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో నివసిస్తున్న ఇజ్రాయెల్ మహిళ కెనెరియత్ గుర్తుచేసుకున్నారు. హమాస్ మిలిటెంట్ల బాంబు దాడితలో తమ ఇల్లు దగ్ధమైందని ఆమె చెప్పుకొచ్చారు. తన సోదరుడితో తాను మాట్లాడనని, తమ కజిన్ హమాస్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు.
భారత్‌లో తాము సురక్షితంగా ఉన్నా వీలైనంత త్వరలో ఇజ్రాయెల్ వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకోవాలని ఉందని చెప్పారు. తమ స్వదేశం వెళ్లేందుకు తానెన్నడూ ఇంతగా భయపడలేదని అన్నారు. రాజస్ధాన్‌లోని పుష్కర్‌ను సందర్శించిన ఇజ్రాయెలీ టూరిస్ట్ అమత్ తాను స్వదేశం వెళ్లి ఇజ్రాయల్ రక్షణ బలగాల్లో చేరి హమాస్ ఉగ్రవాదులతో పోరాడతానని చెప్పాడు. మహిళలు, చిన్నారులు, సైనికులపై హమాస్ చేపడుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఈనెల 15న ఇజ్రాయెల్‌కు తిరుగుముఖం పట్టనున్నట్టు అమత్ తెలిపాడు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

