ISKCON: మేనకా గాంధీపై ఇస్కాన్ వంద కోట్ల పరువునష్టం దావా
ISKCON : కబేళాలకు గోవులను ఇస్కాన్ అమ్ముకుంటోందని ఆరోపణ చేసిన ఎంపీ మేనకా గాంధీపై ఇస్కాన్ పరువు నష్టం కేసు దాఖలు చేయాల్సిన యోచిస్తోంది. సుమారు వంద కోట్ల పరువు నష్టం కేసు వేయనున్నట్లు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు.
న్యూఢిల్లీ: గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్( ISKCON) అమ్ముకుంటున్నదని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఎంపీపై వంద కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు ఇస్కాన్ సిద్ధమైంది. కోల్‌కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ మాట్లాడుతూ.. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల్ని ఆమె వ్యాఖ్యలు బాధించాయని, ఆమెపై వంద కోట్ల పరువునష్టం కేసు వేసేందుకు న్యాయ ప్రక్రియ చేపట్టామని, ఇవాళ ఆమెకు నోటీసు జారీచేశామని ఆయన అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అయిన ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని రాధారామణ్ అన్నారు.
కబేళాలకు గోవుల్ని అమ్ముకుంటున్నారని, దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసమని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతన్న ఇస్కాన్, తమ గోశాలల్లో ఉన్న గోవుల్ని అమ్ముకుంటున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల ఏపీలోని అనంతపురంలో ఉన్న గోశాలను సందర్శించినట్లు ఆమె చెప్పారు. అక్కడ పాలు ఇచ్చే ఆవు ఒక్కటి కూడా లేదని, దూడలు కూడా లేవని, మొత్తం డెయిరిలో ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు లేదని, అంటే అక్కడ ఉన్న ఆవుల్ని అమ్ముకున్నారని తెలుస్తోందని ఆమె ఆరోపించారు.
బీజేపీ ఎంపీ చేసిన తీవ్ర ఆరోపణల్ని ఇస్కాన్ ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. గోవులకు జీవితాలను ప్రసాదిస్తున్నామని, వాటిని కబేళాలకు అమ్మడం లేదని ఇస్కాన్ చెప్పింది. ఇస్కాన్ ప్రతినిధి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఈ విషయాన్ని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

