Supreme Court: ఉరి వేసి చంపడం క్రూరం.. మరేవిధంగా శిక్షను అమలు చేద్దాం
supreme court: ఉరి వేస్తే నొప్పి వస్తుంది. మరి మరణశిక్ష పడ్డ వాళ్లను ఎలా శిక్షించాలి. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేందుకు.. ఉరి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా. ఈ అంశంపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: కొన్ని కేసుల్లో కోర్టులు మరణశిక్ష(Death sentence) విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. మెడకు ఉరి(Hanging) వేసి చంపడం కన్నా.. నొప్పి లేనటువంటి ఇతర పద్ధతుల్లో ప్రాణాలు తీసే వీలు ఉందా అని ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మెడకు ఉరి వేసి శిక్షించడం కన్నా.. తక్కువ స్థాయిలో నొప్పితో చనిపోయే పద్ధతులగురించి సమాచారాన్ని సేకరించి, ఆ అంశాన్ని చర్చించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఉరిశిక్ష ప్రభావం గురించి స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని సుప్రీంకోర్టు కోరింది.
ఈ అంశంపై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. మరణశిక్ష పడ్డవాళ్లకు నొప్పి(Pain) లేకుండా చావును ఇవ్వాలన్న అంశంపై దాఖలైన పిటిషన్ విచారణ నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని పేర్కొన్నది. ఉరికి బదులుగా తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్(lethal injection) ఇవ్వడం, ఎలక్ట్రిక్ షాక్ లాంటి పద్ధతులను అమలు చేయాలంటూ పిటీషన్లో సూచించారు.
మెడకు ఉరి వేసి చంపడం అనే చాలా క్రూరమైన(cruel) పద్ధతి అని లా కమీషన్(Law Commission) లాయర్ రిషి మల్హోత్రా తెలిపారు. ఇది చాలా ఆలోచించాల్సిన అంశమే అని, కానీ దీనిపై సైంటిఫిక్ డేటా అవసరమని, నొప్పుల గురించి స్టడీ చేసిన డేటా ఇవ్వాలని, త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీజేఐ(CJI) డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
కేసు విచారణ సమయంలో.. వివిధ రకాల మరణాల గురించి జడ్జీలు డిస్కస్ చేశారు. అమెరికాలో లీథల్ ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష విధించే పద్ధతి అమలులో ఉన్నా.. ఆ పద్ధతిలో కూడా నొప్పి ఉన్నట్లు జస్టిస్ పీఎస్ నర్సింహా(Justice Narasimha) అభిప్రాయపడ్డారు. ఇంజెక్షన్ ద్వారా చంపడమూ నొప్పే అని, ఇక షూటింగ్ అంటే అదో మిలిటరీ గేమ్ అవుతుందని, ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించినట్లే అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఒకవేళ ప్రాణాంతక ఇంజెక్షన్ విధానాన్ని ఆశ్రయిస్తే, అప్పుడు ఎటువంటి కమికల్(chemical) వాడాలన్న దానిపై రీసర్చ్ చేయాలని జడ్జిలు అభిప్రాయపడ్డారు.
ఉరి తీయడాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా(unconstitutional) ప్రకటిస్తే, అప్పుడు ఇతర పద్ధతుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

