Drugs Seized: గుజరాత్ తీరంలో రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Drugs Seized: ఇరాన్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. ఆ బోటులో సుమారు 61 కేజీల డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ విలువ దాదాపు 425 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
పోరుబందర్: గుజరాత్ తీరం(Gujarat Coast)లో సంచరిస్తున్న ఓ ఇరానియన్ బోటు(Iranian Boat)ను పోలీసులు పట్టుకున్నారు. ఇండియన్ కోస్టు గార్డు, గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆ ఆపరేషన్ నిర్వహించారు. ఆ బోటు నుంచి సుమారు 425 కోట్ల విలువైన 61 కేజీల డ్రగ్స్(Drugs)ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి ఈ ఆపరేషన్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
నార్కోటిక్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దాడి చేశామని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ATS) పోలీసులు వెల్లడించారు. ఓఖా పోర్టుకు కొన్ని వందల నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఇరానియన్ బోటు సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ బోటు కదలికలపై అనుమానం రావడంతో.. కోస్టు గార్డు పోలీసులు(Coast Guard) దాన్ని వెంబడించినట్లు చెప్పారు. ఆ బోటులో 61 కేజీల నార్కోటిక్స్(Narcotics)ను సీజ్ చేశారు.
మొత్తం అయిదు మంది ఇరానియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటును ఓఖా పోర్టు(Okha port)కు తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్లో ఏం ఉన్నదన్న విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ తేల్చనున్నది. నాలుగు నెలల క్రితం కూడా ఓ బోటును ఇలాగే పట్టుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

