న్యూఢిల్లీ : వెరైటీ ఫుడ్ కాంబినేషన్లు ఇటీవల నెట్టింట సందడి చేస్తుండగా (Viral Video) వీటిలో పలు విచిత్ర ఫుడ్ కాంబోస్పై నెటిజన్లు పెదవివిరుస్తున్నారు. ఇక లేటెస్ట్గా లిటిల్ హార్ట్స్, పార్లేజీ హల్వా వీడియో ట్విట్టర్లో వైరలవుతుండగా ఇది టార్చర్ అంటూ పలువురు యూజర్లు నొసలు చిట్లించారు. లిటిల్ హార్ట్స్, పార్లే జీ వంటి బిస్కెట్లతో పాటు ప్యాకేజ్డ్ కేసర్ బాదం మిల్క్‌తో హల్వాను తయారుచేయడంపై నెటిజన్లు భగ్గుమన్నారు.
ట్విట్టర్లో షేర్ చేసిన ఈ క్లిప్‌లో మహిళ హల్వాను తయారుచేస్తుండటం కనిపిస్తుంది. ఆమె లిటిల్ హార్ట్ ప్యాకెట్, పార్లే జీ బిస్కెట్లను ప్యాన్‌పై వేసి వాటిని కేసర్ బాదం మిల్క్‌తో కుక్ చేసి నెయ్యి, షుగర్ జోడించడం ఈ క్లిప్‌లో చూడొచ్చు. ఇక ఆపై డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలతో హల్వా అయిందనిపించింది. ఈ వీడియోకు ఏకంగా 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Torture 🤡🤡🤡🤡 pic.twitter.com/M0ZBFqpbhT
— desi mojito 🇮🇳 (@desimojito) December 6, 2023
ఈ ఫుడ్ కాంబోపై నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. హార్ట్ఎటాక్, డయాబెటిస్‌ను తాను చూశానంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా అసలే హై ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను మరింత ప్రాసెసింగ్ చేస్తున్నారని మరో యూజర్ కామెంట్ చేశారు.