International Flights : అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
International Flights : అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్‌ను భారతదేశం పొడిగించింది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది...

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై (International Flights) సస్పెన్షన్‌ను భారతదేశం పొడిగించింది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. కొవిడ్-19 నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి భారతదేశానికి వచ్చే, వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలు ఎల్లుండి ముగియనున్నందున సమీక్షించిన ప్రభుత్వం.. ఈ ఆంక్షలను వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ సస్సెన్షన్ కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు. అంతర్జాతీయంగా షెడ్యూల్ చేయబడిన విమానాలు కేస్ టు కేస్ ప్రాతిపదికన సమర్థ అధికారం ద్వారా ఎంపిక చేసిన మార్గాల్లో అనుమతించనున్నట్లు సర్క్యులర్‌లో ప్రభుత్వం పేర్కొన్నది.
అంతర్జాతీయ ప్రయాణంపై విస్తృత ఆంక్షలు ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉన్న పౌరులు లేదా అర్హులైన కేసుల్లో స్వదేశానికి రప్పించడానికి కొన్ని విమానాలు అనుమతించనున్నారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో 28 దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాలపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత, సెప్టెంబర్ 3 నుంచి ఇండియా-బంగ్లాదేశ్ మధ్య విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత ఏడాది రెండు దేశాలు సంతకం చేసిన ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం, నాలుగు నెలల తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్‌లో మోదీ
ఇక కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

