ప్రజా సంక్షేమం పక్కనపెట్టి పదవుల కోసం కొట్లాటలు: హర్సిమ్రత్
Harsimrat Kaur: పంజాబ్‌లో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదల్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యాఖ్యానించారు.

చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదల్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని విమర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సరిగా సాగడంలేదని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే అంశాన్ని పక్కనపెట్టి.. ఢిల్లీలో పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఇటీవల విభేదాలు వచ్చాయి. దాంతో కొందరు నేతలు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారిని విడివిడిగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన కాంగ్రెస్ అధిష్ఠానం.. చివరకు కెప్టెన్ అమరీందర్సింగే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హర్సిమ్రత్ కౌర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

