IndiGo | ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి థాయ్‌లాండ్ బయలుదేరిన ఓ ఇండిగో విమానం.. కాసేపటికే మళ్లీ ఢిల్లీ తిరిగి వచ్చింది. ఇండిగో 6E-1763 విమానం.. మంగళవారం ఉదయం 6:41కి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు బయలు దేరింది. అయితే గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పైలట్ విమానాన్ని తిరిగి ఉదయం 7:31కి ఢిల్లీలో ల్యాండ్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలోని ప్రయాణికులందరినీ డీబోర్డ్ చేసి టెర్మినల్ బిల్డింగ్‌కి తరలించినట్లు చెప్పింది. వారందనినీ మరో విమానంలో తరలించే ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో వెల్లడించింది.