నిరుద్యోగ భారత్!
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్.. ఆ వాగ్దానాన్ని గాలికొదిలేసింది. దీంతో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. దేశంలోని యువతకు ఉద్యోగ కల్పన కరోనా సంక్షోభం కంటే దారుణస్థాయికి పడిపోయినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికతో స్పష్టమవుతున్నది.
- కరోనా సంక్షోభం కంటే దిగువకు ఉద్యోగకల్పన
- గత నెలలో 4.7 శాతానికి ఎగబాకిన నిరుద్యోగిత రేటు
- సీఎంఐఈ తాజా గణాంకాలను బట్టి సుస్పష్టం
- 8.7 కోట్ల మంది యువతకు జాబ్ లేదు: నీతిఆయోగ్
- ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీని మరిచిన బీజేపీ
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్.. ఆ వాగ్దానాన్ని గాలికొదిలేసింది. దీంతో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. దేశంలోని యువతకు ఉద్యోగ కల్పన కరోనా సంక్షోభం కంటే దారుణస్థాయికి పడిపోయినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికతో స్పష్టమవుతున్నది. సెప్టెంబర్‌లో 4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. అక్టోబర్‌లో 4.7 శాతానికి ఎగబాకినట్టు సీఎంఐఈ తెలిపింది. ఈనెల వ్యవధిలోనే ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు వెల్లడించింది. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెచ్చరిల్లుతున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.
25 శాతం మందికి నో జాబ్
కరోనా సంక్షోభంలో అంటే 2020 జనవరిలో ఉద్యోగకల్పన రేటు 39.7 శాతంగా నమోదైతే, గత అక్టోబర్‌లో ఇది 39.3 శాతానికి పడిపోయింది. అంటే, ఉద్యోగ కల్పనకు సంబంధించి ప్రస్తుతం దేశంలో కరోనా నాటితో పోలిస్తే గడ్డు పరిస్థితులు ఉన్నట్టు అర్థమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 3.4 శాతంగా ఉండగా అక్టోబర్‌నాటికి అది 4.7 శాతానికి ఎగబాకినట్టు సీఎంఐఈ గణాంకాల్లో తేలింది. ఇదే సమయంలో మహిళల్లో నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 11.7 శాతం ఉండగా, అక్టోబర్‌నాటికి అది 12.7 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. దేశంలోని 250 జిల్లాల్లో నివసిస్తున్న 15-29 ఏండ్ల మధ్య వయసున్న యువతలో 25 శాతం మందికి ఉద్యోగాలులేవని, వాళ్లు ఉన్నత విద్యను కూడా అభ్యసించట్లేదని సీఎంఐఈ గణాంకాల్లో తేలింది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే, రానున్న రోజుల్లో నిరుద్యోగిత మరింతగా పెరిగి, అది ఉత్పాదకతపై తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
8.7 కోట్ల మందికి పని దొరకట్లేదు
దేశంలో 15 నుంచి 29 ఏండ్ల మధ్య వయసున్న యువతలో 8.7 కోట్ల మందికి ఉద్యోగం లేదని నీతిఆయోగ్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా వీళ్లు అటు చదుకోవడంగానీ, ఇటు నైపుణ్య శిక్షణ తీసుకోవడం గానీ చేయట్లేదని వెల్లడించింది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిలో కేవలం 8.5 శాతం మందికి మాత్రమే తమ అర్హతకు తగిన పని దొరుకుతున్నదని నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం ఎంట్రీలెవల్ ఉద్యోగాలకు కూడా పని అనుభవం అడుగుతున్నారని 72 శాతం మంది ఉద్యోగార్థులు ఇటీవలి ఇన్‌డీడ్ సర్వేలో అసహనం వ్యక్తం చేశారు. కేవలం 14 శాతం మంది మాత్రమే తాము ఆశించిన మొదటి ఉద్యోగాన్ని చేజిక్కించుకొన్నట్టు తెలిపారు. అవకాశాల కొరత కారణంగా కెరీర్ ఎంపికలో రాజీపడాల్సి వస్తున్నదని 43 శాతం మంది సర్వేలో వాపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

