Powerful Passports: పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో ఇండియా స్థానం ఎంతంటే ?
Powerful Passports: శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకులను రిలీజ్ చేశారు. టాప్ ప్లేస్‌లో ఆరు దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ దేశాలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. ఇక ఇండియా ర్యాంకు 80వ స్థానంలో ఉన్నది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల పాస్‌పోర్టులు అత్యంత శక్తివంతమైనవి(Powerful Passports)గా హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ పేర్కొన్నది. టాప్ ర్యాంకులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ పాస్‌పోర్టులు ఉన్నవాళ్లు 194 దేశాలకు వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌లను ప్రకటించారు.
గత అయిదేళ్ల నుంచి జపాన్, సింగపూర్ దేశాల మధ్య నెంబర్ వన్ స్థానం కోసం పోటీ ఉండేది. అయితే ఈసారి యురోపియన్ దేశాలు ర్యాంకుల్లో మెరుగైనట్లు తెలుస్తోంది. ఫిన్‌ల్యాండ్, స్వీడెన్, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశ పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.
తాజా ర్యాంకుల్లో ఇండియా పాస్‌పోర్ట్ 80వ స్థానంలో ఉన్నది. ఇండియా పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లు 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ర్యాంకింగ్‌లో పొరుగు దేశం పాకిస్థాన్ 101వ స్థానంలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | నన్ను పెళ్లికి పిలిస్తే సొంత చెల్లిపైనే అడ్డమైన రాతలా..? వైఎస్ జగన్‌పై చంద్రబాబు ఫైర్
‘ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్ఓ డాక్టర్ కోటిరత్నం
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Maths | కొందరు పిల్లలు చిన్నతనం నుంచే గణితంలో నైపుణ్యం కలిగి ఉంటారు, కొందరు ఉండరు.. ఎందుకు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

