Qatar gas plant explosion | ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయులతో సహా 13 మంది మృతి
Qatar gas plant explosion | ఖతార్లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం దీనిని ధృవీకరించింది.
దోహా: ఖతార్లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం దీనిని ధృవీకరించింది. ఆ దేశ ప్రధాన ఎల్ఎన్జీ ఉత్పత్తి, ఎగుమతి కేంద్రమైన విశాలమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఈ సంఘటన జరిగింది. బర్జాన్లోని గ్యాస్ సరఫరా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన ఈ ప్లాంట్లో ఉత్పత్తిని పునరుద్ధరించే సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు ధాటికి పలు భవనాలు కంపించాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని దోహా ప్రాంతంలో కూడా దీని ప్రభావం కనిపించింది.
కాగా, ఈ ప్రమాదంలో భారతీయులతో సహా 13 మంది మరణించినట్లు సమాచారం. మరో 66 మంది గాయపడ్డారని, కొందరి ఆచూకీ తెలియలేదని ఖతార్ ఇంధన శాఖ తెలిపింది. మృతులు, గాయపడిన వారి జాతీయత వివరాలను ఆ దేశ అధికారులు వెల్లడించలేదు. గ్యాస్ ప్లాంట్లో పేలుడును ‘సాంకేతిక ప్రమాదం’గా పేర్కొన్నారు.
మరోవైపు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం జరిగిన దురదృష్టకర ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన చెందుతోంది. అధికారుల సమాచారం ప్రకారం ఈ ఘటనలో పలువురు గాయపడగా, మరికొందరు గల్లంతయ్యారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

