విదేశాల్లోనూ భారత వర్సిటీలు
- క్యాంపస్‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారతదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కొన్ని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీల్లో సీట్లు దొరక్క విదేశాలకు వెళ్లి అక్కడ వర్సిటీల్లో చేరతారు. ఈ పరిస్థితిని నివారించాలని కేంద్రం సంకల్పించింది. భారతదేశంలోని టాప్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు విదేశాల్లో కూడా తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించింది. తద్వారా విద్యార్థుల వలసలను అడ్డుకోవచ్చని, భారత వర్సిటీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని భావిస్తున్నది. తొలిదశలో కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని వర్సిటీలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేస్తాయి. ఈ వర్సిటీల జాబితాను కొన్ని వారాల్లో విడుదల చేస్తారని సమాచారం. భారత వర్సిటీలు.. విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకొని వాటికి మాత్రమే ప్రత్యేకమైన కోర్సులను కూడా బోధించనున్నాయి. దీనికోసం క్రెడిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంటే భారత వర్సిటీలో ఉన్నత విద్య చదివిన అనంతరం వేరే వర్సిటీలో ఉన్న కోర్సును అధ్యయనం చేయాలంటే మళ్లీ అక్కడ ప్రవేశం పొందాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చదువుకొన్న వర్సిటీలోనే ఆ కోర్సును కూడా బోధిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IIT
- Indian varsities
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

