Indian Navy | చైనా విన్నపానికి స్పందించిన ఇండియన్ నేవీ.. రెస్క్యూ కోసం నౌకాదళ విమానం
Indian Navy | చైనా నేవీ విన్నపానికి ఇండియన్ నేవీ (Indian Navy) స్పందించింది. సముద్రంలో మునుగుతున్న చైనా షిప్‌లోని సిబ్బందిని కాపాడేందుకు నౌకాదళానికి చెందిన విమానాన్ని బుధవారం రంగంలోకి దించింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎయిర్ ఎంఆర్ నిమగ్నమైనట్లు భారత నౌకాదళం గురువారం తెలిపింది.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన చేపలు పట్టే నౌక హిందూ మహాసముద్రంలో మంగళవారం బోల్తాపడింది. మునుగుతున్న ఆ షిప్లో 39 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది చైనీయులు కాగా, 17 మంది ఇండోనేషియా, ఐదుగురు ఫిలిప్పిన్ జాతీయులు. వీరి రెస్క్యూ కోసం భారత్‌తో సహా పలు దేశాల సహాయాన్ని చైనా కోరింది. ఈ నేపథ్యంలో చైనా నేవీ విన్నపానికి ఇండియన్ నేవీ (Indian Navy) స్పందించింది. సముద్రంలో మునుగుతున్న చైనా షిప్‌లోని సిబ్బందిని కాపాడేందుకు నౌకాదళానికి చెందిన విమానాన్ని బుధవారం రంగంలోకి దించింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎయిర్ ఎంఆర్ నిమగ్నమైనట్లు భారత నౌకాదళం గురువారం ట్వీట్ చేసింది. అలాగే ప్రమాదం జరిగిన సంఘటనా ప్రాంతానికి చైనా నౌకలు చేరేందుకు సహకరించినట్లు వెల్లడించింది.
కాగా, గురువారం నాటి సెర్చ్ ఆపరేషన్‌లో రెండు మృతదేహాలు లభించినట్లు చైనా మీడియా తెలిపింది. జాడలేని మిగతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే మరణించిన ఇద్దరు సిబ్బంది ఏ దేశానికి చెందినవారో అన్నది చైనా మీడియా వెల్లడించలేదు.
మరోవైపు పశ్చిమ ఆస్ట్రేలియాకు 5000 కిలోమీటర్ల దూరంలో చైనా ఫిషింగ్ షిప్ మునగడంతో సహాయం కోసం మూడు విమానాలు, నాలుగు నౌకలను ఆ దేశం పంపింది. మరిన్ని విమానాలు, నౌకలు, సిబ్బందిని పంపుతున్నట్లు ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ (ఏఎంఎస్ఏ) ప్రతినిధి తెలిపారు. ఇతర దేశాల బృందాలతో కలిసి రెస్క్యూలో పాల్గొంటామని చెప్పారు.
In a swift humanitarian action on 17 May #IndianNavy deployed its Air MR assets in the Southern IOR approx 900 Nm from India, in response to sinking of a #Chinese Fishing Vessel Lu Peng Yuan Yu 028 with 39 crew onboard. The crew incl nationals from China, Indonesia & Philippines pic.twitter.com/gbcbh8DlSc
— SpokespersonNavy (@indiannavy) May 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Aircraft
- Chinese ship
- Crew
- Deploys
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

