Canada | కెనడాలో భారత్ దౌత్యవేత్తలపై నిఘా.. పార్లమెంటుకు తెలిపిన కేంద్రం
కెనడాలోని భారత దౌత్యాధికారులపై ఆడియో, వీడియో నిఘా పెట్టినట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం గురువారం చెప్పింది.
Canada | న్యూఢిల్లీ: కెనడాలోని భారత దౌత్యాధికారులపై ఆడియో, వీడియో నిఘా పెట్టినట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం గురువారం చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న మన దేశ దౌత్యాధికారులపై ఆ దేశం ఆడియో, వీడియో నిఘా పెట్టిందని తెలిపారు.
ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు మన దేశ దౌత్యవేత్తలకు చెప్పారన్నారు. ప్రైవేట్ కమ్యూనికేషన్స్‌ను కూడా అడ్డుకుని, పరిశీలిస్తున్నట్లు తెలిపారన్నారు. దీంతో మన దేశ ంలోని కెనడా హై కమిషన్‌కు ఈ నెల 2న నిరసన తెలిపామని చెప్పారు. కెనడా చర్యలు అన్ని దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు.
కెనడాలోని మనదేశ దౌత్యవేత్తలు ఇప్పటికే తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి ఈ వాస్తవాన్ని కెనడా సమర్థించుకోజాలదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

