చైనీస్ ఆర్మీపై డ్రోన్లతో ఇండియన్ ఆర్మీ నిఘా

న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనీస్ ఆర్మీ దూకుడు ఎక్కువైంది. లఢాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ హద్దు మీరుతున్నారు. దీంతో తాజాగా అత్యంత సున్నితమైన అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ తమ అత్యాధునిక టెక్నాలజీ హెరాన్ డ్రోన్లతో చైనీస్ కార్యకలాపాలపై నిఘా ఉంచింది. అక్కడి ఏవియేషన్ బేస్ ఏఎల్‌హెచ్ ధృవ్ వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థను కూడా సమకూర్చుకున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో తయారైన అత్యాధునిక హెరాన్ డ్రోన్లు నిఘా విషయంలో తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు మేజర్ కార్తీక్ గార్గ్ చెప్పారు.
నిఘా వనరుల విషయానికి వస్తే ఇది అద్భుతమైన ఎయిర్‌క్రాఫ్ట్. దీనిని తొలిసారి వాడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ నిఘా వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తోంది. 30 వేల అడుగుల ఎత్తు వరకూ కూడా ఎగురుతూ.. నేల మీద ఉన్న కమాండర్లకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. దానిని బట్టి తీసుకోవాల్సిన చర్యలపై మేము దృష్టి సారిస్తాం. 24 నుంచి 30 గంటలపాటు ఏకధాటిగా ఇది ఎగరగలదు అని మేజర్ కార్తీక్ తెలిపారు. ప్రస్తుతం అరుణాచల్ వంటి సున్నితమైన సెక్టార్లలో ఇటు ఇండియా, అటు చైనా 50 వేల నుంచి 60 వేల మంది బలగాలను మోహరించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

