న్యూఢిల్లీ: ఆకాశ్ మిస్సైల్(Akash Missile)కి సంబంధించిన వీడియోను ఇవాళ ఇండియన్ ఆర్మీ(Indian Army) షేర్ చేసింది. టార్గెట్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాన్ని ఆ మిస్సైల్ ప్రదర్శించింది. క్షిపణి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆ వీడియోలో చూపించారు. సముద్ర తీరం వద్ద ఆ క్షిపణిని పరీక్షించారు. తమ చూపు నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆ వీడియోలో వార్నింగ్ ఇచ్చారు. ఆకాశ్ మిస్సైల్ ప్రాణాంతకమైందని ఆ వీడియోలో పేర్కొన్నారు. హై ఆల్టిట్యూడ్‌లో చాలా కచ్చితత్వంతో టార్గెట్‌ను మిస్సైల్ ధ్వంసం చేసినట్లు వీడియోలో చూపించారు. ఆర్మీ, ఎయిర్, డిఫెన్స్ థీమ్‌తో ఆ వీడియోను ప్రజెంట్ చేశారు. 10 నుంచి 40 కిలోమీటర్ల ఎత్తులో విహరించే డ్రోన్లను ఆకాశ్ మిస్సైల్ కూల్చివేయగలదు. మిస్సైల్ వంకలు తిరుగుతూ కూడా టార్గెట్‌ను చేరుకున్నది. ఆర్మేనియా దేశానికి ఈ క్షిపణిని ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.
#SkyGladiators#ArmyAirDefence#DefendersOfPunjab#AkashMissile System #Accurate target engagement capability and formidable #Firepower.#DeadlyAndLethal@adgpi@SpokespersonMoD pic.twitter.com/fLYy09gNwG
— Western Command – Indian Army (@westerncomd_IA) March 30, 2024