న్యూఢిల్లీ, జూన్ 2: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భారతీయ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతు ప్రకటించారు. పరీక్షలకు సంబంధించిన లోపాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈనెల 6న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసనలో తాను కూడా పాల్గొంటానని వాంగ్చుక్ తెలిపారు. పరిస్థితులు ఇంత దారుణంగా తయారైతే ఆత్మగౌరవం ఉన్న మంత్రి అయితే రాజీనామా చేయాలి అని ఎక్స్పోస్టులో ఆయన పేర్కొన్నారు.