బాలిస్టిక్ మిస్సైల్‌ని అడ్డుకునే.. ఏడీ 1 క్షిపణి పరీక్ష విజయవంతం
ఏడీ 1 క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్షను నిర్వహించిన డీఆర్డీవోను ఆయన అభినందించారు.
న్యూఢిల్లీ: బాలిస్టిక్ మిస్సైల్‌ని అడ్డుకుని ధ్వంసం చేసే క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) ఇంటర్‌సెప్టర్ ఏడీ-1 రెండో దశ తొలి టెస్ట్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీనిని పరీక్షించింది. క్షిపణి ఫ్లైట్ టెస్ట్ సమయంలో అన్ని వ్యవస్థలు అంచనాలకు అనుగుణంగా పనిచేసినట్లు డీఆర్డీవో తెలిపింది. మిస్సైల్ ఫ్లైట్ డేటాను నమోదు చేసేందుకు మోహరించిన రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ స్టేషన్లతో సహా అనేక రేంజ్ సెన్సార్లు దీని పనితీరును ధృవీకరించాయని పేర్కొంది.
ఏడీ 1 క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్షను నిర్వహించిన డీఆర్డీవోను ఆయన అభినందించారు. అధునాతన సాంకేతికతలతో కూడిన ప్రత్యేకమైన ఇంటర్‌సెప్టర్ ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలలో అందుబాటులో ఉందని అన్నారు. బాలిక్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం మరింత బలోపేతం చేస్తుందని ఆకాక్షించారు.
కాగా, ఏడీ-1 అనేది దీర్ఘ శ్రేణి ఇంటర్‌సెప్టర్ క్షిపణి. దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలను ఇది సమర్థవంతంగా అడ్డుకుని ధ్వంసం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
India today successfully conducted maiden Flight Test of Phase-II Ballistic Missile Defence (BMD) interceptor AD-1 missile with large kill altitude bracket today from APJ Abdul Kalam Island, Odisha. Flight test was carried out with participation of all BMD weapon system elements. pic.twitter.com/itbRtrsBBp
— ANI (@ANI) November 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

