ఆఫ్ఘనిస్థాన్‌కు అత్యవసర మందులు పంపిన భారత్

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ అత్యవసర మందులు పంపింది. మనవతా సహాయంగా వీటిని సమకూర్చింది. కాబూల్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులకు వీటిని అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో సవాలుగా మారిన మానవతావాద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం ఈరోజు తిరుగు ప్రయాణ విమానంలో వైద్య సామాగ్రితో కూడిన మానవతా సహాయాన్ని పంపింది. ఈ మందులు కాబూల్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులకు అందజేస్తాం. కాబూల్‌లోని ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వీటిని వినియోగిస్తారు’ అని పేర్కొంది.
కాగా, భారత్ నుంచి మొదటి వైద్య సహాయంగా అందజేసిన మందులు శనివారం ఉదయం కాబూల్‌కు చేరుకున్నాయని భారత్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ అందజేసిన 1.6 మెట్రిక్ టన్నుల ప్రాణాలను రక్షించే మందులు అనేక కుటుంబాలకు సహాయ పడతాయని అన్నారు. ‘భారత ప్రజల బహుమతి’ గా ఆయన అభివర్ణించారు.

మరోవైపు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్ నుంచి ఆ దేశానికి అందిన తొలి సహాయం ఇదే. శుక్రవారం కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో 104 మంది ప్రజలతోపాటు సిక్కు, హిందూ మతాలకు చెందిన పురాతన పవిత్ర గ్రంథాలు ఢిల్లీకి చేరుకున్నాయి. 104 మందిలో పది మంది భారతీయులు కాగా, 94 మంది ఆఫ్ఘన్ జాతీయులు. ఈ విమానం తిరుగు ప్రయాణంలో అత్యవసర మందులను భారత్ పంపింది.
కాగా, పాకిస్థాన్ మీదుగా రోడ్డు రవాణా ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌కు 50,000 టన్నుల గోధుమలు, మందులను పంపుతామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటి రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఇరు దేశాలు ఖరారు చేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

