దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..?
India Covid-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396 చేరింది. మరో 17 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293 మంది రోగులు డిశార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. ప్రస్తుతం దేశంలో 79,313 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 98.61శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.55శాతంగా ఉందని వివరించింది.
ఇదిలా ఉండగా.. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 2,786 కేసులు, మహారాష్ట్రలో 2,354 కేసులు, ఢిల్లీలో 1,060 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 686 కేసులు, హర్యానాలో 684 కేసులు నమోదైన మొదటి ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచే 76.28 శాతం కొత్త కేసులు రికార్డయ్యాయి. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 13,00,024 డోసులు వేయగా.. ఇప్పటి వరకు 1,96,32,43,003 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 3,88,641 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

