Human Development Index | న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ ఒక ర్యాంకు మెరుగుపర్చుకుంది. 2022 ఏడాదికి సంబంధించి 193 దేశాలకు గానూ 134వ ర్యాంకు సాధించింది.
అంతకుముందు ఏడాది 135వ స్థానంలో నిలిచింది. లింగ అసమానత సూచీ (జీఐఐ) విషయానికొస్తే 2022లో 193 దేశాలలో 108వ ర్యాంకు పొందగా, 2021లో 191 దేశాలలో 122వ ర్యాంకు సాధించింది. ఇక యూఎన్డీపీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అసమానత పెరిగిపోతున్నది.