Millionaires | భారత్‌లో మిలియనీర్లు ఎంతమంది ఉన్నారంటే?
దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్' బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది.
Millionaires | దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం మిలియనీర్ల సంఖ్య 85,698కు చేరుకొన్నట్టు వివరించింది. పది మిలియన్ డాలర్ల కంటే (రూ. 87 కోట్లు) ఎక్కువ సంపద కలిగి ఉన్నవారిని మిలియనీర్లుగా పిలుస్తారు.
ఇదిలాఉండగా కుబేరులు ఎక్కువగా పశ్చిమ దేశాల్లోనే ఉంటారనుకొంటాం. అయితే, సంపన్నులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టాప్-3లో ఇండియా కూడా ఉన్నట్టు ‘నైట్ ఫ్రాంక్’ నివేదిక వెల్లడించింది. కనీసం రూ. 8,500 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగినవారిని బిలియనీర్లుగా పిలుస్తాం. కాగా ప్రపంచంలోని మొత్తం కుబేరుల సంపద విలువ ఏకంగా రూ.1,275 లక్షల కోట్లకు చేరింది.
మన తెలుగువారూ సంపన్నులే!
దేశంలో 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, 217 మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక, 104 మంది సంపన్నులతో హైదరాబాద్ ముచ్చటగా మూడో స్థానాన్ని దక్కించుకొన్నట్టు హురున్ ఇండియా రిచ్‌లిస్ట్-2024 నివేదికలో వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో 109 మంది, ఏపీలో 9 మంది సంపన్నులు ఉన్నట్టు నివేదిక వివరించింది.
భారత్‌లో అత్యంత ధనిక కుటుంబాలు ఇవి..
అంబానీ కుటుంబం 10.09 లక్షల కోట్లు
మిస్త్రీ కుటుంబం 3.25 లక్షల కోట్లు
జిందాల్ కుటుంబం 2.43 లక్షల కోట్లు
బిర్లా కుటుంబం 1.99 లక్షల కోట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

