EC Press meet | ఓటింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాం.. సీఈసీ కీలక ప్రకటన
EC Press meet | దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ అన్నారు. ఓటింగ్‌లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్, మహిళా ఓటర్లకు సెల్యూట్ చేశారు.
EC Press meet | దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ అన్నారు. ఓటింగ్‌లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్, మహిళా ఓటర్లకు సెల్యూట్ చేశారు.
దేశవ్యాప్తంగా 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారని తెలిపారు. 31.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికలను 68,763 బృందాలు పర్యవేక్షించాయని.. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించామని తెలిపారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదని చెప్పారు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కి తగ్గిందన్నారు. అందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల పోలింగ్ జరిగిందని తెలిపారు.
గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని సీఈసీ తెలిపారు. అక్కడ 58.58 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇక ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని వెల్లడించారు. రూ.10వేల కోట్ల నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

