తీపి కబురు.. జూన్ చివరి నాటికి 95 శాతం తగ్గనున్న పాజిటివ్ కేసులు
covid-19 | తీవ్ర కల్లోలం వేళ ఓ తీపి కబురు అందింది. కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న దేశం..

హైదరాబాద్: తీవ్ర కల్లోలం వేళ ఓ తీపి కబురు అందింది. కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న దేశం.. త్వరలోనే కోలుకోనున్నది. జూన్ నెల చివరినాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 శాతం తగ్గనున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగిస్తున్న వేళ ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసిన సూత్ర మ్యాథమెటికల్ మోడల్ ఈ అంచనా వేసింది. సూత్ర గణాంకాల ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలోనూ జూన్ చివరినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 90 శాతం పడిపోనున్నట్లు తెలిసింది. దేశంలో కోవిడ్ గమణం ఎలా సాగుతోందన్న దానిపై గతంలోనూ సూత్ర స్పష్టమైన అంచనాలు చేసింది.
దేశంలో పాజిటివ్ కేసులు రోజు వారి సగటు సంఖ్య 15 వేలకు చేరుకుంటుందని కూడా సూత్ర పేర్కొన్నది. అయితే జూన్ చివరి నాటికి ఈ సగటు సంఖ్య నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి రోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంఖ్య 15వేలకు చేరడం అంటే ఇది చాలా పాజిటివ్ అంశమే.
ఐఐటీ ఖరగపూర్ పరిశోధకులు సూత్ర విధానంతో చేస్తున్న అంచనాలు.. సింగపూర్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అంచనాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. 131 దేశాల్లో కరోనా పరిస్థితిపై సింగపూర్ వర్సిటీ ఎలాంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేసిందో.. అలాంటి అంచనాలనే సూత్ర కూడా చెప్పుకురావడం యాదృశ్చికం. జూన్ 15 తర్వాత ఇండియాలో కోవిడ్ ప్రళయం 97 శాతం తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా సింగపూర్ వర్సిటీ పరిశోధకులు అంచనా వేయడం గమనార్హం.

సూత్ర గణాంకాల విశ్లేషణ ప్రకారం.. జూన్ మొదటి వారంలో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి లోపు పడిపోనున్నాయి. ఐఐటీ కాన్పూర్ పరిశోధకుడు ఎం అగర్వాల్, ఎం కనిత్కర్(ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్), ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకుడు ఎం విద్యాసాగర్ .. సూత్ర మోడల్ ద్వారా మహమ్మారి కరోనా అంచనా వేశారు. సూత్ర పరిశోధకులు అంచనా వేసిన డేటాను www.covid19india.org లో నిక్షిప్తం చేశారు. సూత్ర పరిశోధకులు చేసిన విశ్లేషణ భిన్నమైంది. మూడు విభిన్న పద్ధతులను అనుసరించి.. చివరకు రోజువారీ కొత్త కేసుల ఆధారంగా.. మహమ్మారి భవిష్యత్తును అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

