రహదారులను ఆధునీకరించేందుకు భారత్-ఏడీబీ ఒప్పందం…

ఢిల్లీ,జూన్ 17: తమిళనాడు రాష్ట్రంలో చెన్నై,కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్ (సికెఐసి)లో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి), భారత ప్రభుత్వం 484 మిలియన్ డాలర్ల రుణ కేటాయింపు ఒప్పందంపై సంతకాలు చేశాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఇండియన్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్(ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ – ఇసిఇసి)లో సికెఐసి భాగం. ఇది దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఉత్పత్తి నెట్ వర్క్‌లతో భారత్ ను అనుసంధానం చేస్తుంది. ఇసిఇసిని అభివృద్ధి చేయడంలో భారత ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామిగా ఎడిబి వ్యవహరిస్తున్నది.
భారత ప్రభుత్వం తరఫున తమిళనాడు పారిశ్రామిక అనుసంధాన ప్రాజెక్టు కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా సంతకం చేయగా, భారత్ లోని ఎడిబి కంట్రీ డైరెక్టర్ తకో కొనేషీ ఎడిబి తరఫున సంతకం చేశారు. పారిశ్రామిక సదుపాయాలు, రవాణా, వినియోగ కేంద్రాల మధ్య నిరాటంకమైన సౌకర్యాలుపెంచడానికి ఈ ప్రాజెక్టు కీలకం. ఇది సికెఐసి పరిశ్రమల ఉత్పాదక ఖర్చును తగ్గించడమే కాకుండా వాటిని ప్రోత్సహిస్తుందని, మిశ్రా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

