SI Suspended | మహిళా కానిస్టేబుల్‌కు అసభ్యకర సందేశాలు పంపిన ఎస్ఐ.. సస్పెండ్
SI Suspended | మహిళా కానిస్టేబుల్‌కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్‌లతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు.
లక్నో: మహిళా కానిస్టేబుల్‌కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్‌లతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు. (SI Suspended) ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) చంద్రపాల్ సింగ్ తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని, తన మొబైల్ ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. బరేలీ ఎస్పీ ఘులే సుశీల్ చంద్రభాన్ ఈ ఫిర్యాదుపై స్పందించారు. దర్యాప్తు చేయాలని సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
కాగా, ఎస్ఐ చంద్రపాల్ సింగ్ మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్శించినట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడంతోపాటు అధికారిక బాధ్యతలకు విరుద్ధంగా ప్రవర్తించి పోలీస్ ప్రతిష్టను దిగజార్చినట్లు ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ చంద్రపాల్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అలాగే ఆయనపై డిపార్ట్మెంటల్ దర్యాప్తు జరుపాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

